నందమూరి బాలకృష్ణ క్షమాపణ

నందమూరి బాలకృష్ణ దేవ బ్రాహ్మణ కులానికి క్షమాపణలు చెప్పారు. వారిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ఆయన తెలిపారు.;

Update: 2023-01-15 07:14 GMT
నందమూరి బాలకృష్ణ క్షమాపణ
  • whatsapp icon

నందమూరి బాలకృష్ణ దేవ బ్రాహ్మణ కులానికి క్షమాపణలు చెప్పారు. వారిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ఆయన తెలిపారు. తాను ఇటీవల ఒక కార్యక్రమంలో దేవ బ్రాహ్మణుల నాయకుడు రావణ బ్రహ్మ అని వ్యాఖ్యానించానని, దీనిపై వారు అభ్యంతరం చెప్పారన్నారు. తనకు తెలియకుండానే ఆ పదం వచ్చిందని, తనను క్షమించాలని దేవ బ్రహ్మణులను బాలయ్య బాబు కోరారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

గాయపడటంతో...
దేవ బ్రాహ్మణ కులంలో తనకు ఎంతో మంది అభిమానులున్నారన్న బాలకృష్ణ తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని ఆయన కోరారు. తాను చేసిన వ్యాఖ్యల వల్ల వారి మనోభావాలు గాయపడ్డాయని గుర్తించానని అన్నారు. అందుకు తాను చాలా బాధపడుతున్నానని, క్షమాపణలను కోరుతున్నానని తెలిపారు.


Tags:    

Similar News