నేటి నుంచి నాలుగు రోజులు కుప్పంలోనే
నేటి నుంచి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు;

నేటి నుంచి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కార్యకర్తలు, పార్టీ నేతలతో భువనేశ్వరి సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి తరచూ పర్యటిస్తూ అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నారు.
అభివృద్ధి కార్యక్రమాలను...
నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను భువనేశ్వరి ప్రారంభించనున్నారు. నారా భువనేశ్వరి వస్తుండటంతో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నేతలు హాజరవుతారని, నాలుగురోజుల పాటు అక్కడే ఉండి జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష కూడా నిర్వహించనున్నారు.