మీడియా ముందుకు వచ్చిన లక్ష్మిపార్వతి.. ఆ ఒక్క విషయం గురించి మాట్లాడలేదు
ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న రాజాకీయాలకు సంబంధించి.. ఎన్టీఆర్ భార్య, తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మిపార్వతి
ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న రాజాకీయాలకు సంబంధించి.. ఎన్టీఆర్ భార్య, తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మిపార్వతి మీడియా ముందుకొచ్చారు. తమ పెళ్లి గురించి మాట్లాడతే ఈ సారి కేసు పెడతానని లక్ష్మిపార్వతి హెచ్చరించారు. ఎన్టీఆర్ తో ద్రోహం చేసినవారు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నారని, ఎన్టీఆర్ తో తన పెళ్లి గురించి కూడా తప్పుగా మాట్లాడుతున్నారని కోప్పడ్డారు. కొన్ని మీడియా సంస్థలు దారుణంగా వ్యవహరిస్తున్నాయని.. తనపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నాయని లక్ష్మిపార్వతి ఆరోపించారు. తనపై పని గట్టుకుని వార్తలు రాస్తూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని లక్ష్మిపార్వతి మండిపడ్డారు.
చరిత్రలను ఎవరూ చెరిపేయలేరని, ఇప్పటితరం అప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవాలని.. తాను పదవి కావాలని ఎన్టీఆర్ ను ఎప్పుడూ అడగలేదని, టెక్కలి నుంచి పోటీ చేయాలని అప్పట్లో తనను ప్రజలు కోరారని తెలిపారు. తన వివాహం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని విమర్శించారు. చంద్రబాబుకు తమ పెళ్లంటే ఇష్టం లేదని, మీడియా ముందే ఎన్టీఆర్ తనను పెళ్లి చేసుకున్నారని లక్ష్మిపార్వతి చెప్పారు. తమ పెళ్లి గురించి మాట్లాడతే ఈ సారి కేసు పెడతానని లక్ష్మిపార్వతి హెచ్చరించారు. అప్పట్లో ఎన్టీఆర్ టెక్కలి సీటు ఇస్తానన్నా తాను వద్దన్నానని చెప్పారు. ఎన్టీఆర్ భార్య కంటే పెద్ద పదవి లేదని తాను రాజకీయాలు స్వీకరించలేదన్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంపై ఏపీ రాజకీయాల్లో దుమారం రేగుతోన్న తరుణంలో ఆమె ప్రెస్ మీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పేరు మార్పుపై మాత్రం ఆమె స్పందించలేదు.