30గంటలకు గాని శ్రీవారి దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం భక్తుల రద్దీ అధికం కావడంతో అధికారులు వసతి ఏర్పాట్లపై దృష్టి పెట్టారు
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కూడా భక్తుల రద్దీ అధికం కావడంతో టీటీడీ అధికారులు భోజన, వసతి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వైకుఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు ఇప్పుడు క్యూ లైన్ లో ప్రవేశించే వారికి ముప్పయి గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల దర్శన సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 54,469 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 25,458 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.85 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.