ఒంగోలు వెళ్లే వారికి వారెవ్వా.. ఏం న్యూస్ చెప్పారు?

ఒంగోలు వెళ్లే వారికి జాతీయ రహదారుల సంస్థ అధికారులు శుభవార్త చెప్పారు.

Update: 2024-12-29 12:06 GMT

ఒంగోలు వెళ్లే వారికి జాతీయ రహదారుల సంస్థ అధికారులు శుభవార్త చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి నుంచి ఒంగోలు వరకూ జాతీయ రహదారిని నిర్మించడానికి ఒకే అయింది దాదాపు 250 కిలోమీటర్ల 216 జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు అన్ని రకాలుగా అనుమతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

డీపీఆర్ సిద్ధం చేయాలని...
ఈ మేరకు డిటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌ నోటిఫికేషన్‌ ను జాతీయ రహదారుల సంస్థ జారీ చేసింది. ప్రస్తుత రహదారిని ఏ విధంగా నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయాలని, భూసేకరణ, ఖర్చు తదితర అంశాలను టెండర్‌ దక్కించుకున్న సంస్థ సర్వే చేసి డీపీఆర్ ను తయారు చేస్తుందని జాతీయ రహదారుల సంస్థకు సంబంధించిన అధికారుల తెలిపారు.


Tags:    

Similar News