మద్యం దుకాణాలకు చంద్రబాబు తీపి కబురు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఏడాది మద్యం దుకాణ యజమానులకు తీపికబురు చెప్పారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త ఏడాది మద్యం దుకాణ యజమానులకు తీపికబురు చెప్పారు. రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్ మనీని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మద్యం దుకాణదారులకు ఇప్పటి వరకూ 105. శాతం మార్జిన్ ను మాత్రమే ఇస్తున్నారు. అయితే దీనిని 14 శాతానికి పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
మార్జిన్ మనీని పెంచుతూ...
తెలంగాణలో ఇస్తున్నట్లుగానే ఇక్కడ కూడా 14 శాతం మార్జిన్ మనీని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకూ తమకు మార్జిన్ మనీ విషయంలో తక్కువగా ఇస్తున్నారని మద్యం షాపుల యజమానులు కొంత అసంతృప్తిగా ఉన్నారు. వీరు గత కొంతకాలంగా తమ మార్జిన్ మనీని పెంచాలని కోరుతున్నారు. ఇందుకు చంద్రబాబు అంగీకరించి మార్జిన్ మనీని పెంచేందుకు అంగీకరించడంతో మద్యం దుకాణ యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now