Simhachalam : సింహాచలంలోనూ నెయ్యి సీజ్... ల్యాబ్ కు పంపిన అధికారులు

సింహాచలం దేవస్థానంలో నెయ్యిని అధికారులు సీజ్ చేశారు. పరీక్షలకు ల్యాబ్ కు పంపారు

Update: 2024-09-22 04:08 GMT

 lakshminarasimhaswamy temple

తిరుమల లడ్డూ వివాదంతో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని దేవాలయాల్లో నెయ్యిని పరీక్షలకు పంపుతున్నారు. నెయ్యిలో నాణ్యత ఎంత అన్నదానిపై నిగ్గు తేల్చడానికి అధికారులు సిద్ధమయ్యారు. లడ్డూ తయారీకి వాడే నేతిలో ఎలాంటి పదార్థాలు కలిశాయన్న దానిపై పరీక్షలకు పంపుతున్నారు. అన్ని దేవాలయాల్లో నెయ్యిని పరీక్షలకు పంపాలని నిర్ణయించారు.

సింహాచలంలోనూ...
ఇందులో భాగంగా సింహాచలం దేవస్థానంలో నెయ్యిని అధికారులు సీజ్ చేశారు. 945 కిలోల నెయ్యిని సీజ్ చేసినట్లు ఆహార భద్రతాధికారి అప్పారావు తెలిపారు. భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో దేవాలయంలో తనిఖీలు చేశామని ఆయన తెలిపారు. సీజ్ చేసిన నెయ్యి ఏలూరు జిల్లా రైతు డెయిరీ నుంచి సరఫరా అయిందని, నమూనాలను ల్యాబ్ కు పంపించామని వివరించారు.




Tags:    

Similar News