మరో సర్వే.. మళ్లీ సీఎం ఆయనే..!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉంది. ఇలాంటి సమయాల్లో సర్వేలు చాలా కీలకంగా

Update: 2023-08-08 05:13 GMT

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉంది. ఇలాంటి సమయాల్లో సర్వేలు చాలా కీలకంగా మారుతూ ఉంటాయి. గతంలో వచ్చిన చాలా సర్వేలలో వైసీపీదే విజయమని చెప్పారు. తాజాగా మరో సర్వేలో కూడా వైసీపీ వైపే ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ పోల్‌ సర్వే సంస్థ అయిన పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఫలితాలు వైసీపీకి మంచి బూస్టింగ్ ఇస్తున్నాయి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి 56 శాతం ఓట్లు లభిస్తాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు 35 శాతం ఓట్లు లభించనున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి 9 శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని సర్వే లో తేలింది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైకాపా కి 51 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వేలో తేలింది. తెలుగు దేశం పార్టీకి 41 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. ఇతర పార్టీలకు 8 శాతం ఓట్లు లభిస్తాయని తేలింది. ఈ సర్వే వైసీపీకి ప్లస్ అవ్వనుందని అంటున్నారు. వచ్చే ఎన్నికల సమయానికి మరింత గ్రాఫ్ పెరిగితే.. వైసీపీకి భారీ మెజారిటీ మరోసారి దక్కే అవకాశం ఉందని అంటున్నారు.


Tags:    

Similar News