అంబేద్కర్ ను అవమానించిన వారికి మీ మద్దతా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు.

Update: 2024-12-19 06:26 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా లేఖ రాశారు. అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందన ఏంటో చెప్పాలంటూ కేజ్రీవాల్ ఈ లేఖలో కోరారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించారని, అవమానికి తమ మద్దతు ఉందా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

దేశం ఎదురు చూస్తుందంటూ...
మీ సమాధానం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుందన్న కేజ్రీవాల్ తెలుగుదేశం పార్టీ, జేడీయూలు ఎన్డీఏలు కీలక భాగస్వామ్యులు కావడంతో వారికి ఈ లేఖ రాశారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కాదని, కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్నాయని, అమిత్ షా కనీసం జాతికి క్షమాపణలు కూడా చెప్పలేదని కేజ్రీవాల్ గుర్తు చేశారు. ప్రధాని మోదీకూడా అమిత్ షానే సమర్థిస్తున్నారని, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పై పునరాలోచించుకోవాలని చంద్రబాబును లేఖలో అరవింద్ కేజ్రీవాల్ కోరారు.


Tags:    

Similar News