భవానీలకు ప్రత్యేక ఏర్పాట్లు..ఆలయ అధికారులు

ఈనెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరగనున్న భవానీ దీక్ష విరమణ జరుగుతుందని విజయవాడ ఆలయ అధికారులు తెలిపారు.

Update: 2024-12-19 06:40 GMT

ఈనెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరగనున్న భవానీ దీక్ష విరమణ జరుగుతుందని విజయవాడ ఆలయ అధికారులు తెలిపారు. లక్షలాదిమంది భవానీలు ఆలయానికి చేరుకుంటారని తెలిపారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి లక్షలాదిగా భవానీ మాలధారులు రానున్నారని చెప్పారు.


ఇబ్బందులు లేకుండా...

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ఆలయ పరిధిలోని పూర్తి సమాచారం అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. భవానీ దీక్ష చేపట్టిన వారు భవానీ దీక్ష 2024 యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేరుకోవాలని అధికారులు సూచించారు. దీక్ష విరమణ కువచ్చిన భవానీలందరికీ వీలయినంత త్వరగా అమ్మవారిదర్శనం జరిగేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు.




Tags:    

Similar News