సీఎం జగన్ వ్యక్తిగత జీవితం గురించి లోతైన విషయాలు తెలుసు: పవన్ కళ్యాణ్

తన వారాహి యాత్రలో భాగంగా భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు

Update: 2023-07-01 02:17 GMT

తన వారాహి యాత్రలో భాగంగా భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. పదే పదే తన వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారని.. తాను కూడా వాళ్ల వ్యక్తిగత విషయాలను బయటకు తీయగలనని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలందరూ తమ నోటికి సైలెన్సర్ బిగించుకోవాలని అన్నారు. తాను ప్రభుత్వ పాలసీలపై మాట్లాడుతుంటే, తనపై వ్యక్తిగతంగా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో పెరిగిన సీఎం జగన్ వ్యక్తిగత జీవితం గురించి తనకు లోతైన విషయాలు తెలుసని.. తలచుకుంటే తాను కూడా సీఎంతో పాటు మంత్రుల చిట్టా విప్పగలనని హెచ్చరించారు. తాను చెప్పేది వింటే, జగన్ చెవుల్లో రక్తం కారుతుందని అన్నారు. తనకు సంస్కారం ఉంది కాబట్టి, చిల్లర మాటలు మాట్లాడట్లేదన్నారు. జగన్ గుర్తు పెట్టుకో.. ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ అని మిడిసిపడకు.. నేను విప్లవ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. రాబోయే 25 ఏళ్ళు ఒక కూలీగా పని చేసేందుకు తాను వచ్చానని, వచ్చే ఎన్నికల్లో తనని మనస్పూర్తిగా గెలిపిస్తారని కోరుకుంటున్నానని పవన్ అన్నారు.

సినిమా అభిమానుల్ని విడదీయడం తనకు ఇష్టం లేదని, అందరినీ ఆంధ్రప్రదేశ్ యువతగా మాత్రమేనని చూస్తానని అన్నారు. భీమవరంలో పోస్టర్ గొడవ జరిగితే తనకు చాలా బాధేసిందన్నారు. అప్పులు చేయడం వల్ల ఎక్కువ వడ్డీల రూపంలో పోతున్నాయన్నారు. భీమవరం 38 వార్డులతో పాటు రాష్ట్రమంతా కమిటెడ్ నాయకత్వం రావాలన్నారు. ఒక పదేళ్లు అన్ని మర్చిపోయి అంతా ఏకమవుదామని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి రూ.25 లక్షల ఇన్సూరెన్స్ ఉండేలా పాలసీ ఉండాలన్నారు. జన సైనికులకే రూ.5 లక్షల ఇన్సూరెన్స్ చేసినపుడు.. రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కుటుంబాలకు ఎందుకు చేయలేవని ప్రశ్నించారు. తనకు ఢిల్లీ స్థాయి నాయకులతో పరిచయాలు ఉన్నాయని, తాను ప్రధానిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి గురించి అన్నీ చెప్పొచ్చని పవన్ అన్నారు.


Tags:    

Similar News