మార్చిలో పిఠాపురంలో జనసేన ప్లీనరీ

మార్చి లో జనసేన ప్లీనరీని నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. పిఠాపురంలో మూడు రోజుల పాటు నిర్వహించాలని డిసైడ్ చేశారు.;

Update: 2025-01-03 11:35 GMT

మార్చి లో జనసేన ప్లీనరీని నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. పిఠాపురంలో మూడు రోజుల పాటు ప్లీనరీని నిర్వహించాలని డిసైడ్ చేశారు. మార్చి 12, 13, 14 తేదీల్లో ప్లీనరీని నిర్వహించేందుకు అవసరమైనఏర్పాట్టు చేయాలని నేతలకు సూచించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే తొలి ప్లీనరీ కావడంతో దానిని పిఠాపురం నియోజకవర్గంలోనే నిర్వహించాలని నిర్ణయించారు.

మూడు రోజుల పాటు...
అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే ఈ తొలి ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుంచి జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్యమైన కార్యకర్తలు వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని నేతలను ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నేతలకు, కార్యకర్తలకు అవసరమైన వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని పవన్ కల్యాణ్ కోరారు.


Tags:    

Similar News