దీక్ష విరమించిన జనసేనాని

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులకకు మద్దతుగా ఈరోజు ఉదయం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టారు

Update: 2021-12-12 12:48 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆదివారం ఉదయం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో చేపట్టిన నిరసన దీక్షను సాయంత్రం 5 గంటలకు విరమించారు జనసేనాని. ఆరున్నర గంటల పాటు జరిగిన ఈ దీక్షలో పవన్ కల్యాణ్ తో పాటు పార్టీ నేతలు, జనసైనికులు, పవన్ అభిమానులు పాల్గొన్నారు.

అమరావతిలోనే రాజధాని....
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికుల ఆందోళన 300 రోజులకు పైగా సాగుతోందని.. వారికి నైతికంగా మద్దతిచ్చేందుకే ఈ దీక్ష చేపట్టినట్లు పవన్ తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కార్మికుల దీక్షపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఆదివారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లే దారిలో వడ్డేశ్వరం వద్ద రోడ్డు గుంతలు పడి ఉండటంతో.. స్వయంగా పవన్ కల్యాణ్ పారచేతపట్టి ఆ గుంతలను పూడ్చారు.


Tags:    

Similar News