Andhra Pradesh : ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది;

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. ఉదయం నుంచి సచివాలయ సిబ్బంది ప్రతి లబ్దిదారుడి ఇంటికి వెళ్లి పింఛన్లను మంజూరు చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నెల మొదటి తేదీన పింఛన్లను లబ్దిదారులకు చెల్లించేలా చర్యలను ప్రారంభించింది.
ప్రతి నెల ఒకటో తేదీన...
వృద్ధులు, వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయల చొప్పున పంపిణీ చేస్తుంది. మొత్తం అరవై లక్షల మంది లబ్దిదారులకు పింఛన్లను అందించనున్నారు. ఈరోజు సాయంత్రానికి 90 శాతం పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.