స్పీకర్ పై పోలీసులకు ఫిర్యాదు

Update: 2023-05-31 02:20 GMT

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! జడ్ ప్లస్ కేటగిరి భద్రత పొందే అర్హత బాబుకు ఉందా..? అంటూ ప్రశ్నించారు. దేశంలో థ్రెట్ ఉన్న వాళ్లందరికి జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారా?.. అంటూ వ్యాఖ్యానించారు. అధికారం లేకపోతే చంద్రబాబు విలవిలలాడుతారని.. బ్లాక్‌ కమాండోలను తీసేస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటి? .. వాళ్లున్నారన్న ధైర్యంతో బాబు మాట్లాడుతున్నారంటూ తమ్మినేని సీతారాం అన్నారు. ఎవరిని ఉద్దరించడానికి చంద్రబాబుకు బ్లాక్‌ కమాండోలని తమ్మినేని ప్రశ్నించారు. దేశంలో ఎంతోమందికి బెదిరింపులు వస్తున్నాయని.. చంద్రబాబు ఏమైనా వ్యవస్థలకు అతీతుడా అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడుకు బ్లాక్ కమాండోస్ భద్రత తొలగించాలని ఏపీ స్పీకర్‌గా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తానన్నారు తమ్మినేని.

తమ్మినేని వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వీకర్ వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు చేశారు. స్పీకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ డిమాండ్ చేశారు. ఆమదాలవలసలో పార్టీ శ్రేణులతో కలిసి స్పీకర్ పై ఎస్ఎస్ఐ కృష్ణకు ఫిర్యాదు చేశారు. తమ్మినేని ప్రసంగ వీడియో సీడీని ఫిర్యాదుతో జత చేసి పోలీసులకు అందజేశారు. ఈ వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం దాగి ఉందని, తక్షణమే దర్యాప్తు చేయాలని కోరారు. స్పీకర్ హోదాలో ప్రతిపక్ష నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని.. నిబంధనల ప్రకారం పార్టీ కార్యక్రమాల్లో స్పీకర్ పాల్గొనకూడదని అన్నారు కూన రవికుమార్. దొంగ సర్టిఫికెట్లతో లబ్ది పొందిన తమ్మినేని త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.
చంద్రబాబునాయుడుపై చేసిన వ్యాఖ్యలను స్పీకర్ తమ్మినేని సీతారాం వెనక్కి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి డిమాండ్ చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు రక్షణ కోసం ఏర్పాటు చేసిన బ్లాక్ కమాండోలను తొలగించాలనడం సరికాదన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిపై కనీస గౌరవం, కృతజ్ఞత లేకపోవడం శోచనీయమన్నారు.


Tags:    

Similar News