డిసెంబరు 31న ఏపీలో దానిపై బ్యాన్
ఆంధ్రప్రదేశ్ లో నూతన సంవత్సర వేడుకలపై పోలీసు శాఖ ఆంక్షలు విధించారు.. మార్గదర్శకాలను విడుదల చేసింది
కొత్త సంవత్సరం వేడుకలు త్వరలో జరగనున్నాయి. ఇంకా పది రోజులు మాత్రమే పాత సంవత్సరం మిగిలి ఉంది. కొత్త ఏడాదికి స్వాగతం చెబుతూ దేశ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటారు. కేక్ లు కట్ చేసే వారు కొందరైతే, పార్టీలతో మజా చేసే వారు మరికొందరు. న్యూ ఇయర్ కు కొత్త నిర్ణయాలను తీసుకునే వారు ఇంకొందరు. ఇలా డిసెంబరు 31వ తేదీన పాత ఏడాదికి ఘనంగా వీడ్కోలు చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. సముద్రంలో స్నానాలపై ఆంక్షలు విధించార.
న్యూఇయర్ వేడుకలకు ఏపీకి వెళ్లారో?
అయితే ఆంధ్రప్రదేశ్ లో నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు విధించారు. వీటిపై పోలీసు శాఖ కొన్ని ఆంక్షలను విధించింది. మార్గదర్శకాలను విడుదల చేసింది. రాత్రి ఒంటి గంట వరకూ మాత్రమే ఈవెంట్స్ కు అనుమతి ఇచ్చింది. అయితే ముందుగా పోలీసు శాఖ నుంచి ఈవెంట్స్ కోసం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక మద్యం సేవించి సముద్ర స్నానాలకు వెళ్లొద్దని సూచనలు చేశారు.