29 షరతులతో పాదయాత్రకు అనుమతి

తెలుగుదేశ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశారు

Update: 2023-01-24 09:13 GMT

తెలుగుదేశ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశారు. 29 నిబంధనలను విధిస్తూ అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నిబంధన నోటీసును టీడీపీ నేతలు తిరస్కరించారు. పోలీసులు విధించిన నిబంధనలతో పాదయాత్ర జరగడం కష్టమని టీడీపీ నేతలు పోలీసులకు చెప్పారు. నిబంధనలను ఇన్ని పెట్టి పాదయాత్రలు చేయడమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

29 నిబంధనలను...
పాదయాత్రలో ఏదైనా జరగరానిది జరగితే దానికి పూర్తి బాధ్యత నిర్వాహకులదే అంటూ నిబంధనల్లో పేర్కొనడంపై కూడా టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్ర రోడ్డు లైన్ దాటి వెళ్లకూడదని షరతు విధించడాన్ని కూడా అభ్యంతరం పెట్టారు. అయితే తాము ఈ నోటీసులు తీసుకోవడం లేదని, తాము పాదయాత్ర చేసి తీరుతామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 27వ తేదీన కుప్పంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది.


Tags:    

Similar News