Chandrababu: ఏపీ వరద బాధితులకు గుడ్ న్యూస్... చంద్రబాబుతో మోదీ ఏమన్నారంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గుజరాత్ లో జరిగిన రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ లో పాల్గొనేందుకు చంద్రబాబు వెళ్లారు. అదే సభకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సభకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించారు. ఆయన వద్ద దాదాపు ఐదు నిమిషాలు నిల్చుని ఇటీవల వరదల సమయంలో చూపించిన తెగువను, తీసుకున్న నిర్ణయాలను మోదీ ప్రశంసించినట్లు తెలిసింది.
వరదల సమయంలో...
ఇటీవల కృష్ణా నదికి వరద పోటెత్తడంతో దాదాపు పదకొండు రోజుల పాటు చంద్రబాబు నాయుడు బస్సులోనే ఉంటూ వరద ప్రాంతాల్లో పడవలు, ప్రొక్లెయినర్లపై వెళ్లి బాధితులను ఓదార్చిన విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గుడ్ ఎఫెర్ట్ అని ఆయన ప్రశంసించినట్లు తెలిసింది. నాయకుడంటే అలా ఉండాలని, వరదల వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పకుండా సహకారం అందుతుందని తెలిపినట్లు తెలిసింది. చంద్రబాబు నాయుడును పదే పదే అభినందనలను చెప్పిన మోదీ అధికారిక గణాన్ని పరుగులు పెట్టిస్తూ మీరు పడిన శ్రమకు అభినందనలంటూ మోదీ అన్నట్లు సమాచారం. మొత్తం మీద మోదీ హామీతో ఆంధ్రప్రదేశ్ కు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు అర్థమయింది. త్వరలో ఏపీలో కలుద్దాం అని కూడా అన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.