అన్నయ్య జగన్ కు మంత్రుల రాఖీ
తాడేపల్లిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యాలయంలో రక్షా బంధన్ వేడుకలు జరిగాయి
తాడేపల్లిలో ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో రక్షా బంధన్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మహిళ మంత్రులు, నేతలు జగన్ కు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రులు తానేటి వనిత, విడదల రజనీ, మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మతో పాటు మహిళ ఎమ్మెల్యేలు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు రాఖీ కట్టి ఆయనకు మిఠాయిలను తినిపించారు.
రాఖీ పండగ అంటే...
జగన్ రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, చెల్లెమ్మకు రక్షాబంధన్ శుభాకాంక్షలను తెలిపారు. అన్నా చెల్లెళ్ల ఆత్మీయతలు, అనురాగాలు పండగ రక్షాబంధన్ అని జగన్ అన్నారు. సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణ పరంగా మహిళలకు మంచి చేసే విషయంలో ఈ ప్రభుత్వం ముందు ఉంటుందని జగన్ అన్నారు. అక్క చెల్లెల్లకు దేవుడి ఆశీస్సులు కలకాలం ఉండాలని ఆయన ఆశీర్వదించారు.