మద్యం షాపు దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్... భారీ ఆఫర్

పుట్టపర్తిలో మద్యం దుకాణాన్ని దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్ నకు గురయ్యాడు

Update: 2024-10-15 07:43 GMT

  Liquor Store in Puttaparthi 

పుట్టపర్తిలో మద్యం దుకాణాన్ని దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్ నకు గురయ్యాడు. మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీ ద్వారా ముగిసిన షాపుల కేటాయింపు జరిగింది. పాక్షి షాప్ నెంబర్ 57 ను రంగనాధ్ అనే వ్యక్తి దక్కించుకున్నాడు. అయితే పుట్టపర్తి నుంచి రంగనాధ్ లేపాక్షి కి వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.

పది లక్షలు, నెలకు పదివేలు...
కిడ్నాప్ చేసిన దుండగులు రంగనాథ్ భార్యకు ఫోన్ చేసి పది లక్షల నగదుతో పాటు నెలనెలా పదివేల రూపాయలు చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇందుకు మీకు అంగీకారమేనా అంటూ బేరసారాలకు దిగారు. తమకు వ్యతిరేకంగా రంగనాథ టెండర్ వేయడం వల్లే కిడ్నాప్ చేయాల్సి వచ్చిందని ఫోన్లో మాట్లాడారు. రంగనాథ్ కు ఎటువంటి హాని తలపెట్టమని, డబ్బు ఎక్కడ ఇవ్వాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలంటూ ఫోన్ కాల్ చేసినట్లు కిడ్నాప్ కు గురయిన రంగనాధ్ భార్య తెలిపారు.
Tags:    

Similar News