అమరావతిలో ఇంటర్నేషనల్ లా స్కూలు?
ముఖ్యమంత్రి చంద్రబాబుతో నేడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు భేటీ కానున్నారు.;
ముఖ్యమంత్రి చంద్రబాబుతో నేడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు భేటీ కానున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు సమావేశమవుతారు. అమరావతి లో ఇంటర్నేషనల్ లా స్కూలు ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సన్నద్ధతను వ్యక్తం చేసింది. దీనిపై చర్చించనున్నారు.
టాగా గ్రూపు ఛైర్మన్ తో...
ముఖ్యమంత్రి చంద్రబాబుతో నేడు టాటా గ్రూపు ఛైర్మన్ చంద్రశేఖరన్ సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం జరుగుతుంది. అనంతరం సీఎంతో సీఐఐ ప్రతినిధుల బృందం భేటీ కానుంది. కొత్త పారిశ్రామిక విధానంపై సీఐఐ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు కేంద్రం ప్రభుత్వరంగ సంస్థల ద్వారా పెట్టుబడుల సాధనకు ప్రయత్నాలలో భాగంగా ఆయన సమావేశమవుతున్నారు.