Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినా సరే భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు

Update: 2024-11-05 03:19 GMT

tirumala temple darshan

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినా సరే భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీక మాసం కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకునేందుకు వస్తున్నారు. వసతి గృహాల నుంచి అన్న ప్రసాదాల వరకూ అంతా భక్తులతో రద్దీగా మారింది. ఎక్కడ చూసినా భక్తుల తాకిడి కనిపిస్తుండటంతో వారికి తగిన ఏర్పాట్లను చూసేందుకు అధికారులు ఎక్కడిక్కడ సిబ్బందిని నియమించారు. వసతి గృహాల కొరత వల్ల కొంత సమస్య ఏర్పడుతుందని భక్తులు చెబుతున్నారు. ఈరోజు నాగుల చవితి కూడా కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని చెబుతున్నారు. తిరుమలలో సాధారణంగా భక్తులు శని, ఆదివారాల్లో మాత్రమే వస్తారు. మిగిలిన రోజుల్లో భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. అయితే నిన్నటి నుంచి కార్తీకమాసం ప్రారంభం కావడంతో భక్తుల సంఖ్య ఎక్కువగా పెరిగిండని అధికారులు తెలిపారు. మరో మూడు నెలల పాటు ఇదే తాకిడి కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పదమూడు కంపార్ట్‌మెంట్లలో...
తిరుమలలో శని, ఆదివారాలు దాదాపు 2,75 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అందుకే శని, ఆదివారాలు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. వీకెండ్ లో తిరుమలకు భక్తులు ఎక్కువగా వస్తున్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని74,651 మందిభక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,712 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.14 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News