అమరావతిలోనూ హైటెక్ సిటీ : చంద్రబాబు
అమరావతిలోనూ హైటెక్ సిటీ నిర్మాణానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.;
అమరావతిలోనూ హైటెక్ సిటీ నిర్మాణానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈరోజు ఐటీ శాఖపై సమీక్ష నిర్వహించినప్పుడు ఆయన ఈ ప్రతిపాదన చేశారు. హైటెక్ సిటీకి సంబంధించిన ప్రతిపాదలను రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఈ సమావేశంలో కోరారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డీప్ టెక్నాలజీ పై ఆధారపడి ఉందని, అందుకే డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనాన్నిఅమరావతిలో నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని కోరారు.
ఐకానిక్ భవనం నిర్మాణానికి...
హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణంతో ఐటీ పరిశ్రమ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో ఆయన గుర్తు చేశారు. ఐటీ కంపెనీలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను కూడా నిర్ణయించాలని అధికారులకు సూచించారు. మరో ఐదేళ్లలో రాష్ట్రంలో ఐదు లక్షల వర్క్ స్టేషన్లను ఏర్పాటు లక్ష్యంగా పనిచేయాలని,2034 నాటికి పది లక్షల వర్క్ స్టేషన్లను ఏర్పాటుచేసేందుకు అవసరమైన కార్యాచారణను రూపొందించాలని చంద్రబాబు కోరారు. ఐటీ పరిశ్రమను మరింతగా ఏపీకి చేరువ చేసేలా చర్యలు ఉండాలని చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు.