Tirumala : తిరుమలలో సోమవారం కూడా ఇంత రద్దీ ఏంటబ్బా?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల సంఖ్య తిరుమలలో ఏమాత్రం తగ్గలేదు.

Update: 2024-12-16 03:02 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల సంఖ్య తిరుమలలో ఏమాత్రం తగ్గలేదు. నిన్నటి నుంచి భక్తుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది. మాడవీధుల్లో భక్తుల సంచారం అధికంగా ఉంది. తిరుమల వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. సహజంగా సోమవారానికి తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ సోమవారం కూడా భక్తుల రద్దీ కంటిన్యూ అవ్వడంతో అధికారులు అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కంపార్ట్ మెంట్లలోనూ, అన్నదాన సత్రం వద్ద, లడ్డూ కౌంటర్ల వద్ద ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపిస్తుంది. తిరుమలలో హుండీ ఆదాయం గతంలో కంటే పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. భక్తులు స్వల్ప సంఖ్యలో వచ్చినప్పుడు కూడా హుండీ ఆదాయం మాత్రం తగ్గకపోవడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, క్యూ లైన్ లో ప్రవేశించి స్వామి వారిని దర్శించుకునేంత వరకూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అలాగే ముందుగా దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకున్న భక్తులు సరైన సమయానికి క్యూ లైన్ లోకి వచ్చి స్వామి వారి దర్శనాన్ని పూర్తి చేసుకోవాలని కోరుతున్నారు. ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు

ధనుర్మాసం కావడంతో...
ధనుర్మాసం నేటి నుంచి ప్రారంభమయింది. ధనుర్మాసం అంటే ఎక్కువ మంది విష్ణుమూర్తిని కొలవడం సంప్రదాయంగా వస్తుంది. అందుకే ధనుర్మాసంలో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే శుభప్రదమని విశ్వసిస్తారు. అందువల్లనే రద్దీ ఎక్కువయిందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పద్దెనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటలకు పైగా సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 66,160 మంది దర్శించుకున్నారు. వీరిలో 22,724 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.47 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News