Nara Lokesh : గుడికెళ్తే ఈ దోపిడీ ఎందన్నా.. లోకేష్ రియాక్షన్ ఏంటంటే?

ఒక భక్తుడు చేసిన ట్విట్ కు మంత్రి నారా లోకేష్ స్పందించారు. వెంటనే చర్యలకు ఆదేశించారు

Update: 2024-12-16 06:01 GMT

భక్తి కోసం... గుడికి వెళ్తే....టికెట్ రూపం లో జేబుల్లో డబ్బులు దోచేస్తున్నారు మంత్రి గారు ఒక భక్తుడు చేసిన ట్విట్ కు మంత్రి నారా లోకేష్ స్పందించారు.కాణిపాకం వినాయకుడి ఆలయంలో దోచేస్తున్నారని, టికెట్‌తో సహా భక్తుడు మంత్రి లోకేష్ కు ట్వీట్‌ చేశాడు. కిషోర్ గౌడ్ అనే ఓ నెటిజన్ తనకు ఎదురైన సమస్యను ట్విట్టర్ వేదికగా మంత్రి లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లారు. "నమస్తే నారా లోకేష్ అన్నా.. కాణిపాకంలో దేవాలయం వారి దోపిడీ చాలా దారుణంగా ఉంది. మేము ఈ రోజు 500 రూపాయలు సాధారణ ఆశీర్వాదం టికెట్ తీసుకున్నాము. అయితే దాని మీద ఇద్దరికి కి మాత్రమే అని రాసి ఉంది కానీ ఒకరిని మాత్రమే లోపలికి పంపారు. దానికి అడిగితే ఇక్కడ రూల్స్ ఇంతే ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నారు. దయచేసి దీని మీద చర్యలు తీసుకుని భక్తులకు అన్యాయం జరగకుండా చూడండి' అంటూ ఆ టికెట్‌తో సహా ట్వీట్ చేశారు.

కిషోర్ గౌడ్ చేసిన ట్వీట్ కు...
కిషోర్ గౌడ్ చేసిన ట్వీట్‌పై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. కిషోర్ గౌడ్.. ఈ సమస్యపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి.. కాణిపాకంలో దర్శనానికి సంబంధించి ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేందుకు దేవాదాయశాఖతో కలిసి పనిచేయాలని నా టీమ్‌కు సూచించాను'అంటూ ట్వీట్ చేశారు. మంత్రి నారా లోకేష్ స్పందించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆ నెటిజన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. ఆలయ ఈవో పెంచల కిషోర్‌ కూడా స్పందించారు.. భక్తుడితో అనుచితంగా ప్రవర్తించిన కౌంటర్‌ సిబ్బంది కుట్టిబాబును తాత్కాలిక విధుల నుంచి తొలిగించామని తెలిపారు. దీనిపై పూర్తి విచారణ నిర్వహిస్తామన్నారు.


Tags:    

Similar News