అవినాష్ రెడ్డి ఆరోపణలపై బీటెక్ రవి ఏమన్నారంటే?
ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన ఆరోపణలలో నిజం లేదని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు
వీఆర్వోలను ఎమ్మార్వో ఆఫీస్ లో నిర్బంధించి ఎన్నికలు జరుపుకున్నారని ఎంపీ చేసిన ఆరోపణలలో నిజం లేదని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. అవినాష్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే వేముల పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా ఎమ్మార్వో ఆఫీస్ ల వద్దకు వెళ్లాలి కదా అని బీటెక్ రవి ప్రశ్నించారు. రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో లింగాలో బూత్ క్యాప్చరింగ్ జరుగుతోందని తెలిసిన వెంటనే తాము లింగాలకు వెళ్లామని తెలిపారు. అక్కడ తన మీద దాడి జరిగి ఉండొచ్చు అవమానం జరిగి ఉండొచ్చునని, అయినా ధైర్యంగా తాము వెళ్ళామని బీటెక్ రవి తెలిపారు.పులివెందుల నియోజకవర్గంలో ఒక చిన్న సంఘటనన్నా ఏమైనా జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. పులివెందులలోనే పోటీ పెట్టుకోలేనప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఎలా పోటీ పెడతామని మీరంతా జగన్ తో మాట్లాడుకుని ఎలక్షన్లు బాయికాట్ చేశారని బీటెక్ రవి ఆరోపించారు.