Chandrababu : నేడు పోలవరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును ఈరోజు పరిశీలించనున్నారు

Update: 2024-12-16 01:29 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును ఈరోజు పరిశీలించనున్నారు. ఉదయం10.45 గంటలకు పోలవరం ప్రాజెక్టువద్దకుచేరుకోనున్నారు. ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10:45 గంటలకు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని అనంతరం వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.

అధికారులతో సమీక్ష...
అనంతరం 11:05 నుంచి 12:05 గంటల వరకు ప్రాజెక్టు ప్రాంతంలోని గ్యాప్ వన్, గ్యాప్ టూ, డీ వాల్ నిర్మాణ పనులు, వైబ్రో కాంపాక్షన్ పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలపై అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమీక్షించనున్నారు. సమీక్ష అనంతరం మీడియాతో చంద్రబాబుమాట్లాడనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయనున్నారని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News