Breaking : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..పోలింగ్ తేదీ ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడదలయింది.;

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడదలయింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు షెడ్యూల్ ను విడుదల చేశారు. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవులకు,ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. పదవీ కాలం మార్చి 29వ తేదీతో పూర్తి కానుండటంతో ఈ ఎన్నికలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో...
ఇక ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుంది. మార్చి 3వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.