Andhra pradesh : నేడు రెండో రోజు కలెక్టర్ల సదస్సు
Andhra pradesh : నేడు రెండో రోజు కలెక్టర్ల సదస్సు;

ఆంధ్రప్రదేశ్ లో నేడు రెండో రోజు కలెక్టర్ల సదస్సు జరగనుంది. తొలి రోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. కలెక్టర్లు సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులందరికీ అందించేందుకు పనిచేయాలని ఆదేశించారు. బాధ్యతగా పనిచేయాలని సుతిమెత్తంగా హెచ్చరించారు. ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని పథకాలను గ్రౌండ్ చేస్తుందని తెలిపారు. చంద్రబాబు తర్వాత అనేక మంది ఉన్నతాధికారులు మాట్లాడారు. తమ శాఖలకు సంబంధించిన పనితీరును ప్రస్తావించారు.
ఎస్.పిలతో...
ఈరోజు కూడా కొందరు అధికారులు తమ అభిప్రాయాలను వివరించనున్నారు. జిల్లా ఎస్.పిలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల సమస్యపై ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులతో పాటు మహిళల పట్ల వ్యవహరిస్తున్న వారిని వదిలి పెట్టకుండా చట్టప్రకారం చర్య తీసుకోవాలని చెప్పారు. తర్వాత ఐపీఎస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించాల్సిన అంశంపై చర్చించారు.