సర్వదర్శన టోకెన్ల కోసం భక్తుల తోపులాట.. పలువురికి గాయాలు
గోవిందరాజస్వామి సత్రాల వద్ద జరిగిన తోపులాట ఘటనలో పలువురు భక్తులకు గాయాలు కావడంతో.. వారిని హుటాహుటిన
తిరుపతి : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. మూడ్రోజులుగా టిటిడి సర్వదర్శన టోకెన్లు జారీ చేయకపోవడం, మెట్లమార్గంలో భక్తులను అనుమతించకపోవడంతో భక్తుల తాకిడి పెరిగింది. ఈ రోజు ఉదయం నుంచి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఉదయం 6 గంటల నుంచి క్యూలైన్లో ఉన్న భక్తుల మధ్య తోపులాట జరిగింది.
గోవిందరాజస్వామి సత్రాల వద్ద జరిగిన తోపులాట ఘటనలో పలువురు భక్తులకు గాయాలు కావడంతో.. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఐదు ఆరు గంటలుగా క్యూలైన్లలో వేచి ఉన్నా టిటిడి అధికారులెవరూ పట్టించుకోలేదని భక్తులు వాపోయారు. తాజాగా టిటిడి.. క్యూలైన్లో ఉన్న భక్తులకు ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది. సర్వదర్శనం టోకెన్లకోసం తోపులాట వద్దని, అందరికీ టోకెన్లు లేకుండానే ఉచిత దర్శనం కల్పిస్తామని ప్రకటించడంతో.. భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.