లడ్డూ వివాదంపై "సిట్" ఏర్పాటు
తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యితో ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు
తిరుమలలో జరిగిన కల్తీ నెయ్యితో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని కలపడంతో పాటు వివిధ అపచారాలకు పాల్పడటంపై ఈ సిట్ దర్యాప్తు చేయనుందని చంద్రబాబు తెలిపారు. ఈ సిట్ కు ఐజీ, అంతకంటే పై స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
నివేదిక ఆధారంగా...
సిట్ ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, భవిష్యత్ లో ఎలాంటి తప్పులు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి ఘటనలు తిరుమలలో పునరావృతం కాకూడదన్నదే తమ అభిమతమని ఆయన తెలియజేయాశారు.అన్ని మతాలకు సంబంధించిన సంప్రదాయాలను అందరూ గౌరవించాల్సిందేనని చంద్రబాబు అన్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. సిట్ నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు.