Breaking : అల్లు అర్జున్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది;
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనపై నమోదయిన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సమయంలో నంద్యాల నియోజకవర్గంలో అల్లు అర్జున్ పర్యటించడంతో అక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలగడమే కాకుండా, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు.
నంద్యాల నియోజకవర్గంలో...
అయితే తనపై నమోదయిన కేసులను క్వాష్ చేయాలని అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. నేడు తీర్పు వెలువరించింది. అల్లు అర్జున్ కు ఊరట కలిగించేలా తీర్పు వచ్చింది. ఆయనపై నమోదయిన కేసులను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.