Supreme Court : తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఎలా చూడాలి?

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అందరికీ వర్తిస్తాయి

Update: 2024-09-30 11:23 GMT

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అందరికీ వర్తిస్తాయి. కోట్లాది మంది మనోభావాలు దెబ్బతినేలా పరీక్షలు చేయకుండానే ఎలా ప్రకటన చేశారని ప్రశ్నించింది. ఈరోజు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో ఎక్కడా వాడినట్లు ఆధారాలు లేవని తెలిపింది. ప్రభుత్వం తరుపున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు. ఆయనకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూటి ప్రశ్నలు సంధించింది. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడారా? అన్న ప్రశ్నకు లడ్డూ నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారని తెలిపారు. తయారైన లడ్డూలో కల్తీ నెయ్యిని వాడారా? అంటూ ప్రశ్నించింది.

దేవుళ్లను రాజకీయాల్లోకి...
అనుమానం ఉంటే రెండో అభిప్రాయం తీసకుంటారని, తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలున్నాయా? అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ పూర్తి కాకముందే కల్తీ ఘటనపై ప్రకటనలు చేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపింది. ల్యాబ్ రిపోర్టుల్లోనూ లడ్డూ కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ప్రాధమిక ఆధారాలు లేవని పేర్కొంది. ప్రకటన చేసిన నాటికి ల్యాబ్ రిపోర్టు తిరస్కరించిన శాంపిల్స్ కాదా? అంటూ ప్రశ్నించింది. ప్రాధమిక విచారణలో కల్తీ నెయ్యిని వాడినట్లు ప్రాధమిక ఆధారాలు లేవని పేర్కొంది. సిట్ విచారణకు ఆదేశిస్తే మీడియా ముందుకు ఎలా వస్తారని ప్రశ్నించింది. ఇప్పటికైనా దేవుళ్లను రాజకీయాల దూరంగా ఉంచుతారని ఆశిస్తున్నామని తెలిపింది. అంటే ఈ కామెంట్స్ దేవుళ్లను వాడుకోవాలని చూసే అన్ని రాజకీయ పార్టీలకు చురుకుపుట్టే విధంగా ఈ వ్యాఖ్యలున్నాయి.


Tags:    

Similar News