మనసు మార్చుకున్న జగన్.. పది మందికి ఛాన్స్?

పది మంది వరకూ పాతవారిని కేబినెట్ లో కొనసాగించాలని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో విన్పిస్తున్న టాక్.

Update: 2022-04-08 05:45 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చుకున్నారు. తాను అనుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. పది మంది వరకూ పాతవారిని కేబినెట్ లో కొనసాగించాలని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో విన్పిస్తున్న టాక్. సామాజిక వర్గాల సమీకరణాలతో పాటు విపక్షాలకు ధీటుగా బదులిచ్చే వారిని కొనసాగించాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. తొలుత పాతవారిలో ఐదారుగురిని కొనసాగించాలని అనుకున్నా ఆ సంఖ్య పది వరకూ చేరింది.

సూపర్ సీనియర్లు...
కుల సమీకరణాల ఆధారంగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, తానేటి వనిత, గుమ్మనూరి జయరాం, అంజాద్ భాషా ఆదిమూలపు సురేష్ లు ఉన్నారు. ఇక సీనియారిటీతో పాటు సమర్థవంతంగా విపక్షాల విమర్శలను తిప్పికొట్టే పాతవారిని కొనాసాగించాలని జగన్ భావిస్తున్నారు. ఎన్నికల టీం కావడంతో కొత్త వారితో వెళ్లేకన్నా సూపర్ సీనియర్లకు అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. పాత కేబినెట్ లో ఉండి కొనసాగే వారిలో సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, తానేటి వనిత, గుమ్మనూరి జయరాం, అంజాద్ భాషా, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఉన్నారని తెలిసింది. మిగిలిన 14 మందిలో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.


Tags:    

Similar News