చీఫ్ సెక్రటరీకి బాబు లేఖ.. ఆ డబ్బులన్నీ ఏమయ్యాయి?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. విద్యుత్తు కోతలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. విద్యుత్తు కోతలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగానే విద్యుత్తు కోతలు విధించాల్సి వచ్చిందన్నారు. దేశంలో మిగులు విద్యుత్తు ఉన్న రాష్ట్రాల్లో మూడింటిలో ఏపీని ఒకటిగా నిలిపామన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. నాణ్యమైన, నిరంతరాయమైన విద్యుత్తును అందిస్తేనే పరిశ్రమల, వ్యవసాయ, సేవారంగాలు బతికి బట్టకడతాయని చంద్రబాబు గుర్తు చేశారు.
బొగ్గునిల్వలు......
తమ ప్రభుత్వ హయాంలో 45 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉ:టే ఇప్పుడు ఎందుకు లేవని చంద్రబాబు ప్రశ్నించారు. దీనికి కారణం బొగ్గు సరఫరా సంస్థలకు బకాయీ పడటం నిజం కాదా? అని చంద్రబాబు నిలదీశారు. విద్యుత్తు సంస్థల పేరిట అప్పులు తెచ్చిన 26 వేల కోట్లు, ఛార్జీలను పెంచడం ద్వారా వచ్చిన 16 వేల కోట్లు ఏమయ్యాయని అన్నారు. అవినీతి, నిర్లక్ష్యం కారణంగా ఏపీని అంధకారంలోకి నెట్టేశారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ సంక్షోభంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.