అమరావతి రైతుల కొత్త డిమాండ్లు ఇవే
అమరావతి రైల్వే లైన్ భూసేకరణ విషయంలో మంత్రి పొంగూరు నారాయణ రైతులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు;
అమరావతి రైల్వే లైన్ భూసేకరణ విషయంలో మంత్రి పొంగూరు నారాయణ రైతులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కర్లపూడి, పెదపరిమి, తాడికొండ, నిడుముక్కల గ్రామాల ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అమరావతి మీదుగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూమిని సమీకరించడానికి ఈ సమావేశాన్నిఏర్పాటు చేశారు.
ల్యాండ్ పూలింగ్ ద్వారా...
అయితే రైతులు మాత్రం తమకు భూసేకరణకు బదులుగా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు పొందాలని ఈ సందర్భంగా రైతులు మంత్రి నారాయణ దృష్టికి తెచ్చారు. భూమిని కోల్పోయిన కుటుంబాల్లో ఒకరికి రైల్వే శాఖలో ఉద్యోగం ఇవ్వాలని వారు మంత్రి నారాయణను కోరారు. అయితే ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని, న్యాయం చేయడంలో కృతనిశ్చయంగా ఉన్నామని మంత్రి నారాయణ తెలిపారు.