జగన్ కంటే బాబే రిచ్
చంద్రబాబు జగన్ కు మించి సంపన్నుడు. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థ ఈ విషయం వెల్లడించింది;
ముఖ్యమంత్రిగా జగన్ అందరికంటే సంపన్నుడే. అది వాస్తవమే. కానీ మరొక విషయం ఏంటంటే... చంద్రబాబు జగన్ కు మించి సంపన్నుడు. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థ దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలతో పాటు సంపన్నులైన ఎమ్మెల్యేల ఆస్తులను కూడా ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్న 510 కోట్ల విలువైన ఆస్తుండగా, చంద్రబాబుకు 650 కోట్ల విలువైన ఆస్తులున్నాయని తేల్చారు.
ఎమ్మెల్యేల్లో మూడో స్థానంలో...
ఎమ్మెల్యేల్లో అత్యంత సంపన్నుడిగా కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే నాగరాజు ఉన్నారు. ఆయనకు వెయ్యి కోట్ల ఆస్తులున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయన దేశంలోనే అత్యంత సంపన్నుడైన ఎమ్మెల్యేగా నిలిచాడు. ఆ తర్వాత కర్ణాటక పీసీసీ చీఫ్ ప్రెసిడెంట్ డి.శివకుమార్. ఆయన ఆస్తులు 840 కోట్ల రూపాయలు. చంద్రబాబుకు 650 కోట్ల రూపాయల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచాడు. చంద్రబాబు తర్వాత గుజరాత్ కు చెందిన జయంతి భాయ్ సోమా భాయ్ పటేల్ కు ఉన్నారు.