ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. ఇద్దరు లోక్‌సభ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు.

Update: 2022-07-08 08:12 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. ఇద్దరు లోక్‌సభ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. రాయలసీమలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన కడప, రాజంపేట పార్లమెంటు అభ్యర్థులను చంద్రబాబు పర్యటించారు.

వారికి సహకరించండి...
కడప పార్లమెంటు అభ్యర్థిగా శ్రీనివాసులు రెడ్డి, రాజంపేట లోక్‌సభ అభ్యర్థిగా గంటా నరహరి పేర్లను చంద్రబాబు ప్రకటించారు. వారిద్దరూ వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారని చంద్రబాబు తెలిపారు. ప్రకటించిన అభ్యర్థులు ముందుగానే తమ నియోజకవర్గ పరిధిలో కొంత పర్యటించి నేతలను, కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. ఇద్దరు అభ్యర్థులకు అందరూ సహకరించాలని కోరారు.


Tags:    

Similar News