ఢిల్లీకి చంద్రబాబు.. ఎందుకో తెలిస్తే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చాలా రాజుల తర్వాత ఢిల్లీ వెళుతున్నారు. ఆయన ఈ నెల 6వ తేదీన ఢిల్లీకి వెళతారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చాలా రాజుల తర్వాత ఢిల్లీ వెళుతున్నారు. ఆయన ఈ నెల 6వ తేదీన ఢిల్లీకి వెళతారు. కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల జాతీయ కమిటీ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో ఈ సమావేశం నిర్వహించనున్నారు.
మోదీ, షా.....
2019 ఎన్నికల తర్వాత ఒకసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చారు. టీడీపీ కార్యకర్తలు, రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడులపై ఆయన రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి వచ్చారు. అప్పట్లో ప్రధాని మోదీ, అమిత్ షాల అపాయింట్ మెంట్ కోసం చంద్రబాబు ఎదురు చూసినా వీలు కాలేదు. ఈసారి వీరి అపాయింట్్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అపాయింట్ మెంట్ లభిస్తే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలుస్తారు. అదే సమయంలో నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా మర్యాదపూర్వకంగా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత చంద్రబాబు ఢిల్లీ వస్తుండటంతో కేంద్ర మంత్రులను కూడా కలిసేందుకు పార్టీ నేతలు అపాయింట్ మెంట్లు తీసుకుంటున్నారు.