అధికారంలోకి రాగానే మద్యం షాపులు వారికే

తాము అధికారంలోకి వస్తే మద్యం షాపుల నిర్వహణ బాధ్యతను గీత కార్మికులకు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

Update: 2022-12-23 07:48 GMT

తాము అధికారంలోకి వస్తే మద్యం షాపుల నిర్వహణ బాధ్యతను గీత కార్మికులకు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లాలోని రాజాంలో ఆయన బీసీ వర్గాలతో మాట్లాడుతూ బీసీ కులాలను రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేసింది టీడీపీయేనని అన్నారు. బీసీలను ఈ ముఖ్యమంత్రి మోసం చేశాడన్నారు. తన వ్యాపారాలను రాజకీయాలకు ముడిపెడుతున్న ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని అన్నారు. ప్రజల సొమ్మును తన వ్యాపారాలకు తరలిస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని, అధికారంలో ఉండగా ఏం చేశామన్నది శాశ్వతమని తెలిపారు.

కల్లుగీత కార్మికులు, మత్స్యకారులను...
కల్లుగీత కార్మికులు, మత్స్యకారులను తాము అధకారంలోకి వచ్చిన వెంటనే ఆదుకుంటామని తెలిపారు. టీడీపీ అంటేనే బీసీలపార్టీ అని ఆయన అన్నారు. మత్స్యకారులు కూడా ఈ ప్రభుత్వ విధానం వల్ల రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన చెందారు. బీసీల సమస్యలను అన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. బీసీల్లో ఎన్ని కులాలున్నాయో అందరినీ ఆదుకునేలా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలను రూపొందిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లాలో రెండోరోజు చంద్రబాబు పర్యటిస్తున్నారు. మరికాసేపట్లో ఆయన బొబ్బిలిలో రోడ్ షో నిర్వహించనున్నారు.


Tags:    

Similar News