జగనూ.. విజయం మాదే.. కూటమి సర్కార్ ఖాయం
రాయలసీమలోనూ కూటమిదే ప్రభంజనమని ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ కృష్ణరాజు అన్నారు
రాయలసీమలోనూ కూటమిదే ప్రభంజనమని ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ కృష్ణరాజు అన్నారు. 150 స్థానాలు ఖాయమని ఆయన తెలిపారు.టీడీపీ ముసుగులో వైసీపీ తరపున స్వతంత్ర అభ్యర్థిగా శివరామరాజు నామినేషన్ వేశారన్న రఘురామ కృష్ణరాజుపార్టీ వీడొద్దని ఎంతో ప్రాధేయపడ్డానని,. అయినా ఆయన వైసీపీ నాయకత్వంతో కలిసిపోయారని చెప్పారు. జగన్ కావాలా... పోవాలా అని జరుగుతున్న ఈ ఎన్నికల్లో జగన్ పోవాలనుకునే వారంతా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమికి ఓటు వేయండని రఘురామ కృష్ణరాజు పిలుపు నిచ్చారు.
నేను చెప్పబట్టే...
2014లో తిరిగి శివరామరాజు ఎమ్మెల్యేగా విజయం సాధించడంలో, టికెట్ దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిని తానేనేనని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ఆయనకు గతంలో తన వల్లే సీటు వచ్చిందని, తాను ఆయన్ని పార్టీ వీడకుండా అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశానని తెలిపారు. నరసింహ రాజు, శివరామరాజు మధ్య ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయోనని పోటీ నెలకొందన్న రఘురామ కృష్ణంరాజు, ప్రస్తుతం తన వెనుక ఎవరూ లేరని శివరామకృష్ణం రాజు బుకాయించవచ్చని. ఎన్నికల అనంతరం ఆయన, వైసీపీలో చేరవచ్చునని తెలిపారు.