న్యాయ విచారణ జరపాల్సిందే.. బాబు లేఖ
వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై ఖచ్చితంగా న్యాయవిచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.
వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై ఖచ్చితంగా న్యాయవిచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈమేరకు చంద్రబాబు చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమ ే 6,054 కోట్ల నష్టం వాటిల్లితే, కేవలం ఇప్పటి వరకూ 35 కోట్ల నిధులను మాత్రమే విడుదల చేయడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రకృతి వైపరిత్యాల కోసం ఖర్చు చేయాల్సిన 1100 కోట్ల నిధులను ఇతర పథకాలకు మళ్లించడాన్ని కాగ్ తప్పపట్టిన విషయాన్ని చంద్రబాబు ఈ లేఖలో గుర్తు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తుందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని చంద్రబాబు లేఖలో అభిప్రాయపడ్డారు. తుమ్మల చెరువు ప్రాంతాన్ని ఆటస్థలంగా మార్చడం వల్లే ఈ విపత్తు సంభవించిందన్నారు. తుపాను, వరద తగ్గినా సహాయ కార్యక్రమాలను బాధితులకు అందించడంలో ప్రభుత్వం వైఫ్యలం చెందిందని, దీనిపై న్యాయ విచారణ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.