యువగళం తిరిగి ప్రారంభం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేడు 78వ రోజుకు చేరుకుంది
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేడు 78వ రోజుకు చేరుకుంది. ఆదోని మండలంలోనే కొనసాగుంది. నిన్న రంజాన్ పండగకు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన లోకేష్ ఈరోజు తిరిగి యువగళం పాదయాత్రను ప్రారంభించారు. ఇప్పటి వరకూ లోకేష్ 10004 కిలోమీటర్ల దూరం నడిచారు. ఉదయం ఏడు గంటలకు కడితోట క్రాస్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. గణేకల్, జాలిమంచి, పాండవగల్లు, బల్లేకట్టు, కుప్పల్ గ్రామాల మీదుగా సాగనుంది.
పర్యటన ఇలా...
మధ్యాహ్నం పన్నెండు గంటలకు కుప్పగల్ శివారులో బీసీ సామాజికవర్గీయులతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం అక్కడే భోజన విరామానికి ఆగుతారు. అనంతరం పాదయాత్ర అక్కడి నుంచి బయలుదేరి పెద్దతుంబళం చేరుకుంటుంది. అక్కడ గ్రామస్థులతో లోకేష్ సమావేశమై సమస్యలపై చర్చిస్తారు. రాత్రికి పెద్దతుంబళం క్రాస్ వద్ద లోకేష్ బస చేయనున్నారు.