తెలుగు రాష్ట్రాల్లో కొత్త పార్టీ.. స్థాపించింది ఎవరంటే?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ముఖ్యంగా వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ

Update: 2023-12-22 15:01 GMT

telugusena

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ముఖ్యంగా వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్యనే జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మరో పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పుట్టుకొచ్చింది. తాజాగా సినీ ప్రొడ్యూసర్ సత్యారెడ్డి 'తెలుగు సేన' అనే ఒక కొత్త పార్టీని స్థాపించారు. తెలుగుసేన పార్టీ అధ్యక్షుడుగా సత్యారెడ్డి ఎన్నికయ్యారు. గద్దర్ చివరిగా నటించిన ఉక్కు సత్యాగ్రహం సినిమాను సత్యారెడ్డి నిర్మించారు. అయ్యప్ప దీక్ష, ప్రశ్నిస్తా, సర్దార్ చిన్నపరెడ్డి సహా 53 సినిమాలను ఆయన తీశారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని, ఉద్యమాలను, ఉద్యమ సినిమాలను రాజకీయంగా అడ్డుకుంటున్నందుకు రాజకీయ పార్టీ పెడుతున్నట్లు సత్యారెడ్డి ప్రకటించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో తెలుగుసేన పార్టీని ఆయన ప్రకటించారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుకరణకు వ్యతిరేకంగా, స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చిన నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలుగు సేన పార్టీ ధర్నా చేపట్టింది. అంతేకాకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా తెలుగు సేన పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ ధర్నాలో తెలుగు సేన పార్టీ నేతలు మాత్రమే కాకుండా.. స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. తెలుగుసేన పార్టీ అధ్యక్షులు సత్య రెడ్డి మాట్లాడుతూ.. గద్దర్ ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగు సేన పార్టీ ఉద్భవించిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం తెలుగు సేన పార్టీ పోరాడుతుందని తెలిపారు.


Full View


Tags:    

Similar News