ఏపీలో రేపు టెన్త్ ఫలితాలు
ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. గ్రేడ్లు కాకుండా మార్కుల రూపంలోనే ఫలితాలు విడుదల చేస్తారు
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ విజయవాడలో టెన్త్ ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
గ్రేడ్లు కాదు... మార్కులే...
2019 తర్వాత పదో తరగతి పరీక్షలను కరోనా కారణంగా నిర్వహించలేదు. అందరీని పాస్ చేసి ఉన్నత తరగతులకు పంపేలా ప్రభుత్వం రెండేళ్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నిర్వహించింది. కొంత పేపర్ లీకేజీ అన్న విమర్శలు వచ్చినా పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. మొత్తం ఈ ఏడాది 6,21,799 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. అయితే ఈసారి ఫలితాలు గ్రేడ్ల రూపంలో విడుదల చేయరు. కేవలం మార్కుల రూపంలోనే ఫలితాలను ప్రకటించనున్నారు.