Tirumala : తిరుమలలో నేడు ఖాళీగా వీధులు... కంపార్ట్‌మెంట్లలో భక్తులు లేక?

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగా ఉన్నాయి.

Update: 2024-11-12 03:01 GMT

tirumala darshan

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ తిరుమలలో అంతగా లేదు. నిన్న కార్తీక సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చారు. ఈరోజు మాత్రం మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. మాడవీధులన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. వసతి గృహాలు కూడా సులువుగానే దొరుకుతున్నాయి. పెద్దగా వేచి ఉండకుండానే భక్తులకు వసతి గృహాలు అలాట్‌మెంట్ జరుగుతుంది. అన్నదాన సత్రం వద్ద కూడా భక్తుల తాకిడి అంతగా లేదు. కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగా ఉండటంతో భక్తులు రాక పెద్దగా లేకపోవడంతో లడ్డూ ప్రసాదాల తయారీ విషయంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. లడ్డూల తయారీని ఎప్పటికంటే కొంత తగ్గించి తయారు చేయాలని పోటు ప్రసాదం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సులువుగానే దర్శనం లభిస్తుండటంతో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కూడా తగ్గుముఖం పట్టే అవకాశముందన్న అంచనాల్లో అధికారులున్నారు.

కంపార్ట్‌మెంట్లన్నీ...
తిరుమలకు సాధారణంగా శుక్ర, శని, ఆదివారాలు భక్తుల రాక ఎక్కువగా ఉంటుంది. ఈ మూడు రోజుల్లోనే భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో అందుకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒక కంపార్ట్‌మెంట్ లోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల్లో దర్శనం పూర్తవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట నుంచి రెండు గంటల సమయం మాత్రమే పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73.917 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,161 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.82 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News