Cyclone Mocha : ఏపీకి తప్పిన "మోచా" ముప్పు..
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. రేపటికి అనగా మే 8కి అది అల్పపీడనంగా..
నాలుగు రోజులుగా బంగాళాఖాతంలో తుపాను ఏర్పడనుందని, దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలపై తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన స్పష్టత వచ్చింది. మోచా తుపాను ముప్పు ప్రస్తుతానికి ఏపీకి ఉండదని ఏపీ వాతావరణ విభాగం వెల్లడించింది. భారత్ లో ఏ తీరానికి ఈ తుఫాను ముప్పు లేదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. రేపటికి అనగా మే 8కి అది అల్పపీడనంగా మారనుంది. మే 9 నాటికి వాయుగుండంగా మారి, ఆపై తుఫానుగా రూపాంతరం చెంది మయన్మార్ తీరాన్ని మే 13కి తాకనున్నట్లు వెల్లడించింది. ఒకవేళ తుపాను అనూహ్యంగా దిశను మార్చుకుంటే దాని ప్రభావం భారత్ పై ఉండవచ్చు.