రష్ అంతగా లేదు.. రీజన్ ఇదే
తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా కన్పించడం లేదు. విద్యార్థులకు పరీక్షలు దగ్గరపడుతుండటంతో రద్దీ తగ్గిందని చెబుతున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా కన్పించడం లేదు. విద్యార్థులకు పరీక్షలు దగ్గరపడుతుండటంతో తిరుమలతో భక్తుల రద్దీ అంతగా లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి దర్శన సమయం మూడు నుంచి నాలుగు గంటల్లో పూర్తవుతుంది. సర్వ దర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 62,101 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 25,986 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారని అధికారులు వెల్లడించారు.
రేపు మే నెల టోకెన్లు...
నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.37 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. రేపు ఉదయం తొమ్మిది గంటలకు మార్చినెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేయనున్నారు. రేపు మధ్యాహ్నం మే నెలకు సంబంధించిన అంగప్రదిక్షణ టోకెన్లు కూడా టీటీడీ విడుదల చేయనుంది. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని టీటీడీ కోరుతుంది.