Tiger : ఒకటి కాదు... రెండు పులులట.. భయపడుతున్న జనం

ఏలూరు జిల్లాలో పులి సంచారం కలవరం పుట్టిస్తుంది. ఒక పులి కాదు రెండు పులులు తిరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు

Update: 2024-01-30 04:09 GMT

ఏలూరు జిల్లాలో పులి సంచారం కలవరం పుట్టిస్తుంది. ఒక పులి కాదు రెండు పులులు తిరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం రామసింగవరం పంట పొలాల్లో ఒక దూడ మీదకు పులి దాడిచేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

సరిహద్దు ప్రాంతంలో...
దూడను సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి చంపినట్లు ఆనవాళళ్లు లభించడంతో ప్రజలు భయపడిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లోనే ఈ పులి సంచారం ఉందని అటవీ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. రెండు పులులు తిరుగుతున్నట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన చేయకున్నా పులి సంచారంతో ఆ ప్రాంత ప్రజలు భయపడిపోతున్నారు. పులి కోసం ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా బోనులను ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News