Tirumala : తిరుమలలో భక్తుల రద్దీతో అలెర్టయిన అధికారులు

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది;

Update: 2024-11-03 03:47 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కొద్ది రోజులుగా భక్తుల రద్దీగా కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమలలో గత కొద్ది రోజులుగా భక్తుల తాకిడితో రద్దీగా మారుతుంది. వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మాడ వీధులన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఇక తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం వద్ద కూడా ఉదయం నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు వసతి గృహాలు దొరకడం కూడా ఆలస్యమవుతుంది. గంటల పాటు వసతి గృహాల కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. దీంతో భక్తులు ఎక్కువ మంది వసతి గృహాల కోసమే ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు దృష్టికి రావడంతో సత్వరం చర్యలు ప్రారంభించారు. వరస సెలవులు రావడంతోనే భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. మరోవైపు కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తులు అధికంగా వస్తున్నారంటున్నారు. మొన్నటి వరకూ వర్షాలకు భయపడి కొంత రద్దీ తగ్గినా, మళ్లీ ఒక్కసారిగా తిరుమలకు భక్తుల తాకిడి పెరగడంతో అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

అన్ని కంపార్ట్ మెంట్లలో...
తిరుమలలో ఈ నె 5న నాగులచవితి సందర్భంగా శ్రీవారికి పెద్దశేష వాహనసేవ జరుగుతుందని అధికారులు తెలిపారు. 8న పుష్పయాగానికి అంకురార్పణ జరుగుతుందని, 9న మలయప్పస్వామికి పుష్పార్చన ఉంటుందని, ఈనెల 13న సూర్యోదయానికి ముందు శ్రీదేవి భూదేవి సమేతుడైన ఉగ్రశ్రీనివాసమూర్తి తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారని అధికారులు తెలిపారు. ఈనెల 15వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా గరుడు వాహనంపై శ్రీవారి దర్శనం ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూ లైన్ బయట వరకూ విస్తరించి ఉంది. ఈరోజు ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 80,706 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 36,829 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.52 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.



Tags:    

Similar News